Viral video | అందమైన మగువలతోపాటే రెడ్ కార్పెట్‌పై బొద్దింక ర్యాంప్ వాక్ అదుర్స్.. మెట్ గాలా-2023లో స్పెషల్ అట్రాక్షన్..!
Viral video | ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలా-2023 (Met Gala-2023)లో అందమైన మగువలతోపాటు ఓ బొద్దింక (Cockroach) కూడా ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టింది. దాంతో ఈ ఈవెంట్‌కు హాజరైన ఎందరో అందాల తారల మాదిరిగానే బొద్దింక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
న్యూయార్క్: ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలా-2023 (Met Gala-2023)లో అందమైన మగువలతోపాటు ఓ బొద్దింక (Cockroach) కూడా ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టింది. దాంతో ఈ ఈవెంట్‌కు హాజరైన ఎందరో అందాల తారల మాదిరిగానే బొద్దింక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. గత సోమవారం (మే 1వ తేదీ) న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా-2023 జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
మన దేశం నుంచి కూడా పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. వరల్డ్ క్లాస్ టాప్ సెలెబ్రిటీస్ అంతా తమతమ అద్భుతమైన అవుట్ ఫిట్స్ తో చూపరులకు కనువిందు చేశారు. కోట్ల విలువ చేసే దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. కళ్లు మిరిమిట్లు గొలిపే తెల్ల రంగు గౌన్ ధరించిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఫ్యాషన్ ఈవెంట్లోకి అనుకోని అతిథి ప్రవేశించి అందరిని ఆశ్చర్యపర్చింది. ఆ అతిథే ఓ బొద్దింక. అవును బొద్దింకనే. అందమైన సెలెబ్రిటీలు అంతా ర్యాంప్ వాక్ చేస్తుంటే.. ఎక్కడి నుంచి వచ్చిందోగానీ ఓ బొద్దింక రెడ్ కార్పెట్‌పై ప్రత్యక్షమైంది. రెడ్ కార్పెట్‌పై వంకరటింకరగా తిరుగుతూ చివరికి మెట్లెక్కి స్టేజీ పైకి వెళ్లిపోయింది. ఈ అసక్తికర మూవ్‌మెంట్స్‌ను అక్కడే ఉన్న కెమెరా మెన్స్ తమ కెమెరాల్లో బంధించారు.
బొద్దింక చేసిన ఆ ర్యాంప్ వాక్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది. కింది వీడియోలో బొద్దింక ర్యాంప్ వాక్ దృశ్యాలను మీరూ ఒకసారి వీక్షించండి..
A cockroach has arrived at the #MetGala. https://t.co/OcPy5ckhQN pic.twitter.com/4YiEPs5cIT
— Variety (@Variety) May 2, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

