Viral Video | ఓ వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించాడు. తాను పెంచుకుంటున్న పైథాన్‌తో వీధుల్లో వీరంగం సృష్టిస్తూ.. ప్రజలపై దాడి చేశాడు. ఈ ఘటనను ఒకరు తీవ్రంగా తప్పుబట్టడంతో.. అతనిపై పైథాన్‌తో దాడి చేసి హంగామా సృష్టించాడు. ఈ ఘటన కెనడాలోని టోరంటోలో బుధవారం రాత్రి 11:50 గంటలకు చోటు చేసుకుంది.
టోరంటోలోని దుందాస్ స్ట్రీట్ వెస్ట్‌లో ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న పైథాన్‌తో బయటకు వచ్చాడు. ఇక ఆ పైథాన్‌ను చూపించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ వ్యక్తిపై దాంతో దాడి చేసేందుకు యత్నించగా, ప్రతిఘటించాడు. అంతలోపే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక చేసేదేమీ లేక పైథాన్‌ను పక్కకు విసిరేసి, పోలీసులకు లొంగిపోయాడు అతను. పైథాన్‌తో దాడి చేసిన వ్యక్తిని టోరంటోకు చెందిన ల్యూరినియో అవిలా(45)గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు.
Dude uses his pet snake as a weapon during street fight in Toronto 😳 pic.twitter.com/T2lLKaLe4E
— Crazy Clips (@crazyclipsonly) May 13, 2023