USA | బ్యాంక్ చోరీకోసం ఉబెర్ క్యాబ్‌లో వెళ్లాడు.. సీసీటీవీలో దొరికిపోయాడు
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో ఉబెర్ క్యాబ్‌లో వెళ్లి చోరీ
Michigan : ఎవరైనా ఆఫీస్ లేదా హాస్పిటల్‌కి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంటారు. కానీ, అమెరికాలో ఒకతను మాత్రం బ్యాంకులో దొంగతనం చేసేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అంతేకాదు తనను ఇంటి దగ్గర దించడానికి అక్కడే కొంచెం సేపు ఆగాలని ఆ క్యాబ్ డ్రైవర్ని బెదిరించాడు. మిచిగాన్‌లోని సౌత్‌ఫీల్డ్‌లో ఉన్న హంటింగ్టన్ బ్యాంకులో గురువారం చోరీ జరిగింది. దొంగతనం కేసులో జాసన్ క్రిస్టమస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి దొంగతనం చేసిన సొమ్ముని స్వాధీనం చేసుకున్నారు.
సౌత్ఫీల్డ్కు చెందిన జాసన్ క్రిస్టమస్ హంటింగ్టన్ బ్యాంక్‌లో దొంగతనం చేసేందుకు క్యాబ్‌లో వెళ్లాడు. చోరీ తర్వాత అదే క్యాబ్‌లో సౌత్ఫీల్డ్లోని తన ఇంటికి వెళ్లాడు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులు సౌత్‌ఫీల్డ్‌లో జాసన్‌ను అరెస్ట్ చేశారు. ‘అతని డ్రైవింగ్ లైసెన్స్ ఈమధ్యే రద్దయింది. దాంతో, బ్యాంక్ వరకు వెళ్లడానికి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తాను బ్యాంక్ లోపలికి వెళ్లి వచ్చేవరకు అక్కడే ఉండాలని క్యాబ్ డ్రైవర్ని బెదిరించాడు. తమ సిటీలో ఇలాంటి చోరీ జరగడం చాలా అరుదు’ అని సౌత్‌ఫీల్డ్ పోలీసుల అధికారి ఎల్విన్ బారెన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

