Adani | కొలంబో పోర్టులో టెర్మినల్ నిర్మాణానికి ఆగిపోయిన రుణం.. అదానీకి మరో ఎదురుదెబ్బ
అదానీ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అదానీ సంస్థ భాగస్వామిగా ఉన్న కొలంబో పోర్టు టెర్మినల్ ప్రాజెక్టు నిర్మాణానికి యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీఎఫ్సీ) నుంచి రావాల్సిన రుణం ఆగిపోయింది.
- యూఎస్ ఐడీఎఫ్సీ నిర్ణయం
- నిలిచిపోయిన రూ.4,661 కోట్లు
Adani | న్యూయార్క్, నవంబర్ 25: అదానీ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అదానీ సంస్థ భాగస్వామిగా ఉన్న కొలంబో పోర్టు టెర్మినల్ ప్రాజెక్టు నిర్మాణానికి యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీఎఫ్సీ) నుంచి రావాల్సిన రుణం ఆగిపోయింది. శ్రీలంక రాజధానిలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.4,661 కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు గత నవంబర్లో అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన డీఎఫ్సీ అంగీకరించింది. అయితే, భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారని గౌతమ్ ఆదానీ సహా అదానీ గ్రూప్ ముఖ్యులపై అమెరికా న్యాయ శాఖ ఆరోపణల నేపథ్యంలో ఈ రుణం ఆగిపోయింది.
ఇప్పటివరకు ఈ రుణం కింద నిధులు విడుదల చేయని డీఎఫ్సీ.. ఇప్పుడు తన నిర్ణయాన్ని సమీక్షించుకుంటున్నది. అదానీపై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలపై అవగాహన ఉందని, ఈ అంశాన్ని సమీక్షిస్తున్నామని డీఎఫ్సీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. పోర్టు టెర్మినల్ నిర్మాణానికి రుణం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదని తెలిపింది. ‘మా ప్రాజెక్టులు, భాగస్వాములు అత్యున్నత నిబద్ధత, సమగ్రతా ప్రమాణాలను పాటించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని డీఎఫ్సీ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

