ప్రధాని పదవి నుంచి తప్పుకుంటా..! : ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్ ప్రకటన
డబ్లిన్ : ఐర్లాండ్ ప్రధాని, భారత సంతతికి చెందిన లియో వరద్కర్ (45) బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
డబ్లిన్ : ఐర్లాండ్ ప్రధాని, భారత సంతతికి చెందిన లియో వరద్కర్ (45) బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన పార్టీ ఫైన్ గేల్ పదవి నుంచి కూడా లియో వరద్కర్ వైదొలిగారు.
తాను ఫైన్ గేల్ అధ్యక్షుడిగా, నాయకుడిగా ఈ రోజు నుంచి వైదొలుగుతున్నానని, తదుపరి నేత ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం తాను ప్రధాని పదవికీ రాజీనామా చేస్తానని చెప్పారు. డబ్లిన్లో విలేకరులతో మాట్లాడుతూ వరద్కర్ కీలక ప్రకటన చేశారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో తాను ప్రధాని పదవితో పాటు పార్టీ పదవుల నుంచి వైదొలుగుతున్నానని ఐరిష్ నేత వెల్లడించారు.
భవిష్యత్కు సంబంధించి తనకు ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ ప్రణాళికలు లేవని పేర్కొన్నారు. 2017లో అధికారంలోకి వచ్చిన వరద్కర్ అత్యంత పిన్నవయస్కుడైన ఐర్లాండ్ ప్రధానిగా ఘనత సాధించారు. దేశానికి సారధ్యం వహించిన సమయం తన జీవితంలో అధిక సంతృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Read More :
Watch: షాపింగ్ మాల్లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి.. పసి బాలుడు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

