పుతిన్‌ను చంపేయండి.. రష్యన్లకు అమెరికా సెనెటర్ పిలుపు
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సీ గ్రాహమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ను భౌతికంగా అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎలా ముగుస్తుంది? అని ప్రశ్నించగా.. ‘పుతిన్‌ను హత్య చేయాలి. అప్పుడే ఆ యుద్ధం ఆగిపోతుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ను అంతం చేయడానికి రష్యాలో ఎవరో ఒకరు ముందుకు రావాలని అన్నారు. ప్రజల జీవితాలో చీకట్లలో ఉండకుండా వుండేందుకు, పేదరికం నుంచి బయటపడాలంటే పుతిన్‌ను హత్య చేయడమే కరెక్ట్ అంటూ ఎంపీ లిండ్సీ గ్రాహమ్ వ్యాఖ్యానించారు.
తీవ్రంగా స్పందించిన రష్యా
అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేయాలని అమెరికా ఎంపీ పిలుపు ఇవ్వడంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేరమని అమెరికాలో రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై అమెరికా ఇంకా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

