ఆస్ట్రేలియాలోని ఓ బార్ అది. మందు బాబులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే బార్లోకి ఊహించని అతిథి ప్రవేశించింది. ఆ అతిథి మనిషి అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఆ అతిథి ఓ జంతువు. అదే కంగారూ బార్లోకి ప్రవేశించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది. బార్లోకి వెళ్లిన కంగారూ.. తన దారిన తానూ వెళ్లిపోయింది.
కంగారూ బార్లోకి ప్రవేశించిన వీడియోను ఆస్ట్రేలియన్ ఎనిమల్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఊహించని అతిథి అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 85 వేల మంది లైక్ చేశారు. మిలియన్ల మంది వీక్షించారు.