పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు పక్షవాతం వచ్చింది. దీని వల్ల ఆయన ఈ వారం నిర్వహించాల్సిన షోలను రద్దు చేశారు. 28 ఏళ్ల స్టార్ సింగర్ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా వెల్లడించారు. రామ్సే హంట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నానని, దాని వల్ల తన ముఖంలో పక్షవాతం వచ్చినట్లు బీబర్ చెప్పాడు. ముఖంపై కుడివైపున పక్షవాతం వచ్చిందని, ఆ కారణంగా కన్ను ఆడించలేకపోతున్నానని, ఇక కుడి వైపున చిరునవ్వు కూడా కనిపించదని, ఆ సైడ్ మొత్తం పెరాలసిస్ వచ్చినట్లు చెప్పాడు. వాస్తవానికి ఫిబ్రవరిలో బీబర్ తన జస్టిస్ వరల్డ్ టూర్‌ను స్టార్ట్ చేశాడు. అయితే మూడు షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. చెవిలో ఉన్న నాడికి వైరస్ సోకడం వల్ల ముఖానికి పక్షవాతం వచ్చినట్లు బీబర్ తెలిపాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండియాలో బీబర్ తన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ షో ఉంటుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు.