Lunar Mission | జపాన్ లూనార్ మిషన్ ప్రయోగం వాయిదా.. ప్రతికూల వాతావరణమే కారణం
జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా జపాన్ (Japan) చేపట్టిన మూన్ ల్యాండర్ (Moon Sniper) రాకెట్ ప్రయోగం వాయిదాపడింది.
టోక్యో: జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా జపాన్ (Japan) చేపట్టిన మూన్ ల్యాండర్ (Moon Sniper) రాకెట్ ప్రయోగం వాయిదాపడింది. కగోషిమా ప్రిఫెక్చర్‌లోని జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్లో (Tanegashima Space Center) ఉన్న యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి సోమవారం ఉదయం 9.26 గంటలకు హెచ్2-ఏ (H2-A) రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. అయితే ప్రతికూల వాతావరణం (Poor weather) కారణంగా ప్రయోగాన్ని వాయిదావేస్తున్నట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ జాక్సా (JAXA) వెల్లడించింది. కాగా, ఈ ప్రయోగం పోస్ట్‌పోన్ కావడం ఇది మూడోసారి.
నాసా (NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో చంద్రునిపై పరిశోధనలు జరపడానికి స్మార్ట్ ల్యాండర్ లేదా స్లిమ్, లూనార్ ప్రోబ్‌ను జపాన్ అభివృద్ధి చేసింది. మిషన్ విజయవంతమైతే చంద్రునిపై ల్యాండర్‌ను సాఫ్ట్ లాండ్ చేసిన ఐదో దేశంగా జపాన్ అవతరించనుంది. అయితే ప్రయోగించిన 3-4 నెలల తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. కాగా, చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో విజయవంతంగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Japan 1
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- H2-A rocke
- Japan
- JAXA
- Lunar Mission
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

