Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Milan protest : యూరప్ దేశమైన ఇటలీలో భారీ నిరసనలు జరుగుతున్నాయి. దేశ రాజధాని మిలన్‌తోపాటు బొలోగ్నా నగరంలో ఆందోళనకారులు భారీ ఎత్తున ఉద్యమించారు. దీంతో నగరం అనేక చోట్ల తగలబడింది.
Milan protest : యూరప్ దేశమైన ఇటలీలో భారీ నిరసనలు జరుగుతున్నాయి. దేశ రాజధాని మిలన్‌తోపాటు బొలోగ్నా నగరంలో ఆందోళనకారులు భారీ ఎత్తున ఉద్యమించారు. దీంతో నగరం అనేక చోట్ల తగలబడింది. అటు పోలీసులకు, ఇటు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం, ధరల పెరుగుదల, తక్కువ వేతనాలు, వైద్య సదుపాయాల్లో లోపాలు, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు లేమి వంటి అంశాలకు నిరసనగా ఇటలీలో యువత, విద్యార్థులతోపాటు ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా భారీ ఎత్తున శనివారం ఉద్యమం చేపట్టారు.
ఇటలీలోని అనేక నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని మిలన్లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పియాజ్జా డెల్ డువోమో, గ్యాలేరియా విట్టోరియో ఎమాన్యుయెలె 2 వంటి లగ్జరీ షాపింగ్ మాల్ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. అయితే, ఈ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు.
అయితే, ఆందోళనకారులు మరింత ఉద్రిక్తంగా మారారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు. పలు షాపింగ్ మాళ్లను తగులబెట్టారు. అనేక షాపులను లూటీ చేశారు. ఈ ఆందోళన సమయంలో అక్కడి ఒక భారీ షాపింగ్ మాల్‌ను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో అనేక మంది ఆందోళనకారులతోపాటు, పోలీసులు కూడా గాయపడ్డారు. 50 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ ఆందోళనలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఆందోళన చేయడం ప్రజల హక్కు అని, గొప్ప ప్రజాస్వామ్యానికి నిరసనలు పునాదివంటివని అభిప్రాయపడ్డారు. అలాగని నగరాల్ని తగులబెట్టడం సరికాదని మెలోని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, పోలీసులపై దాడి చేయడాన్ని తప్పుబట్టారు. ఈ దాడుల్ని, నిరసనల్ని ప్రతిపక్షాలు కూడా ఖండించాలని ఆమె సూచించారు. మరోవైపు ఫ్రాన్స్‌లో కూడా ఇలాగే ఆందోళనలు జరుగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

