India-US Trade | అమెరికాకు ఎగుమతుల్లో 5.57 శాతం వృద్ధి.. ట్రంప్ రాకతో పురోగతిపై ఆశలు..!
India-US Trade | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ భారత్ ఎగుమతులు 5.57శాతం పెరిగి రూ.59.93 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
India-US Trade | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ భారత్ ఎగుమతులు 5.57శాతం పెరిగి రూ.59.93 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశీయ ఉత్పత్తులకు అమెరికాలో ఆరోగ్యకరమైన గిరాకీ ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేవలం డిసెంబర్ నెలలోనే ఎగుమతులు 8.49 శాతం వృద్ధి చెంది ఏడు బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. మరోవైపు, అమెరికా నుంచి దిగుమతులు 1.91శాతం పెరిగి 33.4 బిలియన్ డాలర్లకు చేరితే, డిసెంబర్ లోనే 9.88 శాతం వృద్ధితో 3.77 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. మున్ముందు భారత్, అమెరికా మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కింద 93.4 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయి. ఇదే కాలంలో భారత్- చైనా మధ్య 94.6 బిలియన్ డాలర్ల లావాదేవీలు నమోదయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. దీనివల్ల భారత ఉత్పత్తులకు మరింత గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు. 2021-22 నుంచి భారత్కు అమెరికా అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

