టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం.. 91 దేశాలపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడం వల్ల సుమారు 91 దేశాలు కొత్త కరోనా వేరియంట్లతో ఇబ్బందిపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. పుణెలోని సీరం సంస్థతో పాటు ఆస్ట్రాజెనికా కంపెనీలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్లు సరఫరా చేయాలి. అతి పేద ఆఫ్రికా దేశాలకు ఆ టీకాలను అందించాల్సి ఉంది. కానీ భారత్ నుంచి వ్యాక్సిన్ల ఎగుమతి లేకపోవడం వల్ల 91 దేశాలు టీకాల కోసం ఎదురుచూస్తున్నాయని ఆమె అన్నారు.
B.1.617.2 వేరియంట్ వైరస్ ఇండియాలో పెను విషాదం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఇండియా అమ్మేందుకు నిరాకరించింది. B.1.617.2 వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ఆఫ్రికా దేశాల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని సౌమ్యా తెలిపారు. కొత్త కొత్త వేరియంట్ల అతి వేగంగా విస్తరిస్తున్న కారణంగా పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందన్నారు. డబ్ల్యూహెచ్వోలోని గవి ఒప్పందం ప్రకారం పేద దేశాలకు ఆస్ట్రాజెనికా, సీరం సంస్థలు సుమారు వంద కోట్ల టీకాలను సరఫరా చేయాలని, 2020లోనే ఆ సంఖ్య 40 కోట్లు ఉండాలని, కానీ అలా జరగడం లేదని ఆమె అన్నారు.
ఆఫ్రికా దేశాల్లో కేవలం 0.5 శాతం మంది మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు స్వామినాథన్ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలు ఇలాగే ఉంటే.. పేద దేశాలు మరింత ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆమె చెప్పారు. వాస్తవానికి వ్యాక్సిన్లకు అనుమతి రాకముందే అమెరికా, బ్రిటన్, కెనడా, ఇజ్రాయిల్, ఈయూ దేశాలు ఆర్డర్లు చేశాయి. గత ఏడాది ఆగస్టు నాటికే 15 కోట్ల డోసులకు యూకే ఆర్డర్ ఇచ్చింది. కనీసం ఈ ఏడాది చివరి వరకు అయినా వ్యాక్సిన్ల ఎగుమతికి భారత్ అనుమతి ఇస్తుందని భావిస్తున్నట్లు సౌమ్యా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

