Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
Saudi Arabia : సౌదీ అరేబియాలోని ఎయిర్‌పోర్టుపై హౌతీలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరు భారతీయుడు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
Saudi Arabia : సౌదీ అరేబియాలోని ఎయిర్‌పోర్టుపై హౌతీలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరు భారతీయుడు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఉన్న కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు బుధవారం రాత్రి దాడి చేశారు. 20 రాకెట్లతో హౌతీ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరు భారతీయుడు.
మరో ఎనిమిది మంది గాయపడగా.. వారిలో ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు. ఈ విషయాన్ని గురువారం సౌదీ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో ఎయిర్పోర్ట్ కూడా భారీగా ధ్వంసమైంది. అయితే, దాడి తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి విమానయాన కార్యకలాపాలు కొనసాగాయా.. లేదా అనే విషయంపై స్పష్టత లేదు. దమ్మామ్ ఎయిర్‌పోర్టు సౌదీ అరేబియాలోని ఈస్టర్న్ ప్రావిన్స్‌లో అత్యంత కీలకమైంది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కావడంతో హౌతీలు దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.
మరోవైపు భారతీయుడు మృతిచెందడంపై సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ ప్రకటన చేసింది. ఎయిర్‌పోర్టుపై హౌతీలు జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డట్లు సౌదీ ప్రభుత్వం తమకు తెలిపిందని ఎంబసీ వెల్లడించింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. బాధితుల కుటుంబాన్ని సంప్రదిస్తున్నామని వివరించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. యెమెన్ దేశంలోని తిరుగుబాటు సైన్యం హౌతీలు. వీరికి ఇరాన్ మద్దతు ఇస్తోంది. అలాగే, యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో హౌతీలు.. సౌదీ అరేబియాపై దాడులకు దిగుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

