న్యూయార్క్, జూన్ 3 : అమెరికాలో భారత జాతీయ జెండాకు అవమానం జరిగింది. టెక్సాస్లోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట క్లేటన్ వాకర్ అనే వ్యక్తి నోట్లో సిగరెట్ ఉంచుకుని.. భారత జెండాను చింపేస్తూ బూతులు మాట్లాడాడు. పక్కనే ఉన్న కొందరు అమెరికన్లు చప్పట్లు కొడుతూ భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కాగా ఫ్రిస్కో సిటీలో ఇండియన్ల జనాభా పెరిగిపోతున్నదని.. వాళ్లే ఆక్రమించేసుకుంటున్నారంటూ అక్కడ వ్యతిరేకిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.