ఖార్కివ్: తారస్ షెవ్చెంకో ఉక్రెయిన్ జాతీయ కవి. ఇది ఆయన విగ్రహామే. ఖార్కివ్‌లోని ప్రధాన రహదారి వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని రష్యా బాంబు దాడుల నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శతాబ్ధాల క్రితం నాటి చెట్ల మధ్య ఉన్న విగ్రహాన్ని కాపాడుకునేందుకు స్థానికులు ఇసుక బ్యాగులతో ఆ విగ్రహాన్ని కప్పేస్తున్నారు. 19వ శతాబ్ధానికి చెందిన తారస్ షెవ్చెంకో ఉక్రెయిన్ భాషలో గొప్ప పండితుడు. 1991లో సోవియెట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రతి నగరంలోనూ షెవ్చెంకో విగ్రహం లేదా సెంటర్ లేని నగరం లేదంటే అతిశయోక్తి కాదు.
ఖార్కివ్‌లో ఉన్న బ్లాక్ క్యాస్ట్ ఐరన్ స్టాచ్యూ చుట్టూ ఇప్పుడు స్థానికులు ఉసిక బ్యాగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహం ఎత్తు 16 మీటర్లు. నగరాన్ని రక్షించుకోవాలని, ఎందుకంటే భవిష్యత్తు తరాలకు షెవ్చెంకో ఎవరో తెలియాలంటే తప్పదని స్థానికులంటున్నారు. ఖార్కివ్‌లో 1935లో షెవ్చెంకో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోషలిజం, స్టానిలిజం భావాలు మిక్స్ అయినట్లు ఈ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహం కింద భాగంలో విప్లవ సైనికులు ఉండగా, పైభాగంలో జాతీయ కవి తారస్ షెవ్చెంకో ఉంటాడు.