Israel | బహుళ అంచెల రక్షా కవచం.. శత్రు దుర్భేద్యం ఇజ్రాయెల్ గగనతలం
ఇరాన్ నుంచి దూసుకొచ్చిన వందల డ్రోన్లు, క్షిపణి దాడులను ఇజ్రాయెల్ బహుళ అంచెల రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. 99 శాతం డ్రోన్లను కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. శత్రు దేశాల దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అత్యాధునిక సాంకేతికతతో బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థను రూపొందించింది.
Israel | జెరూసలేం, ఏప్రిల్ 14: ఇరాన్ నుంచి దూసుకొచ్చిన వందల డ్రోన్లు, క్షిపణి దాడులను ఇజ్రాయెల్ బహుళ అంచెల రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. 99 శాతం డ్రోన్లను కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. శత్రు దేశాల దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అత్యాధునిక సాంకేతికతతో బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థను రూపొందించింది. ఇందులో ఒక్కో విభాగం ఒక్కో విధంగా పనిచేస్తూ శత్రుదాడులను సమర్థంగా తిప్పికొట్టగలవు. ది యారో, డేవిడ్స్ స్లింగ్, పేట్రియాట్, ఐరన్ డోమ్, ఇరన్ బీమ్ వ్యవస్థలు ఇజ్రాయెల్‌కు రక్షా కవచంగా నిలుస్తున్నాయి. అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం..

ది యారో: ఆవరణానికి ఆవల దీన్ని ఆపరేట్ చేస్తారు. దీర్ఘ శ్రేణి క్షిపణులను కూల్చేందుకు దీనిని ఉపయోగిస్తారు. దీన్ని అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. యెమెన్ నుంచి హౌతీ మిలిటెంట్లు ప్రయోగిస్తున్న క్షిపణులను అడ్డుకునేందుకు ప్రస్తుతం దీన్ని వాడుతున్నారు.
డేవిడ్స్ స్లింగ్: దీన్ని కూడా అమెరికాతో కలిసి అభివృద్ధి చేసింది. ఇది మధ్యస్థాయి క్షిపణులను అడ్డుకుంటుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రయోగించే క్షిపణులను అడ్డుకునేందుకు దీన్ని వాడుతున్నారు.
పేట్రియాట్: ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇదే పురాతనమైనది. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధంలో ఇరాక్ ప్రయోగించిన స్కడ్ మిస్సైల్స్‌ను అడ్డుకునేందుకు దీనిని వాడారు. ఇది ఇది అమెరికా తయారుచేసిన వ్యవస్థ. ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్స్, డ్రోన్లను కూల్చేందుకు వాడుతున్నారు.
ఐరన్ డోమ్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ. స్వల్పశ్రేణి రాకెట్ల దాడులను ఇది సమర్థంగా అడ్డుకొంటుంది. దీని సక్సెస్ రేటు 90 శాతం. ప్రస్తుత యుద్ధంలో హమాస్, హెజ్బొల్లా దాడులను అడ్డుకునేందుకు దీన్ని వినియోగిస్తున్నారు.
ఐరన్ బీమ్: ఇజ్రాయెల్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యవస్థ.. లేజర్ టెక్నాలజీ ద్వారా శత్రు ముప్పులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థల కంటే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో దీన్ని గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు. అయితే ఈ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- drones
- IDF
- Iranian attack
- Israeli
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

