Gaza Strip: గాజాస్ట్రిప్‌పై ఐడీఎఫ్ భీకర దాడి.. 450 హమాస్ కేంద్రాలపై అటాక్
Gaza Strip: ఇజ్రాయిల్ రక్షణ దళాలు.. గాజా స్ట్రిప్‌పై భీకర అటాక్ చేశాయి. గత 24 గంటల్లో మెరుపుదాడితో హమాస్ కేంద్రాలను నేలమట్టం చేశాయి. గాజాస్ట్రిప్‌లోని సుమారు 450 ప్రాంతాలపై ఇజ్రాయిల్ దాడి చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గాజా స్ట్రిప్: ఇజ్రాయిల్ రక్షణ దళాలు.. గాజా స్ట్రిప్(Gaza Strip)పై భీకర అటాక్ చేశాయి. గత 24 గంటల్లో మెరుపుదాడితో హమాస్ కేంద్రాలను నేలమట్టం చేశాయి. హమాస్‌కు గాజాలో పట్టు ఉన్న ప్రదేశాలపై ఐడీఎఫ్ లక్షిత దాడలు చేసింది. రాత్రంతా భారీ స్థాయిలో ఇజ్రాయిల్ దళాలు విరుచుకుపడ్డాయి. గాజాస్ట్రిప్‌లోని సుమారు 450 ప్రాంతాలపై ఇజ్రాయిల్ దాడి చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయిల్ భీకర దాడి వల్ల అండర్‌గ్రౌండ్ కేంద్రాలన్నీ దెబ్బతిన్నాయి. హమాస్‌కు చెందిన కేంద్రాలపై విస్తృతస్థాయిలో దాడులు కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ పేర్కొన్నది. చాలా భీకరంగా దాడులు జరిగినట్లు హమాస్ కూడా ప్రకటించింది.
తాజా దాడుల్లో సుమారు 200 మంది వరకు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. హమాస్‌కు చెందిన ఫీల్డ్ కమాండర్లు భారీ సంఖ్యలో ప్రాణాలు విడిచి ఉంటారని ఇజ్రాయిల్ పేర్కొన్నది. బెటాలియన్, బ్రిగేడియర్ స్థాయిల్లో ఉన్న కమాండర్లు హతమైనట్లు తెలిపారు. టన్నెల్స్ దాగి ఉన్న ఫీల్డ్ కమాండర్లు కూడా చనిపోయి ఉంటారని ఇజ్రాయిల్ తెలిపింది. హమాస్ సీనియర్ నేతలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

