Watch: పాక్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం… పై అంతస్తులకు వ్యాపించిన మంటలు
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పాక్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే అగ్నిమాపక, సహాయక బృందాలు సకాలంలో చేరుకోలేకపోవడంతో మంటలు మరింతగా వ్యాపించినట్లు ఆరోపించాయి.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఒక పెద్ద షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మాల్ పై అంతస్తుల వరకు మంటలు, పొగలు వ్యాపించాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. సెంటారస్ మాల్లోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. రాజుకున్న మంటలు, దట్టమైన పొగలు ఆ బిల్డింగ్ 20వ అంతస్తు, ఆపై వరకు వ్యాపించాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న నివాసితులు భయాందోళన చెందారు.
కాగా, సమాచారం అందుకున్న పాక్ అగ్నిమాపక, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పాక్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే అగ్నిమాపక, సహాయక బృందాలు సకాలంలో చేరుకోలేకపోవడంతో మంటలు మరింతగా వ్యాపించినట్లు ఆరోపించాయి.
మరోవైపు పాకిస్థాన్ మాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎవరికీ ఏ ప్రమాదం జరుగకూడదంటూ నెటిజన్లు, ఆ దేశ ప్రజలు ప్రార్థించారు.
Praying for no loss of life at Centaurus Mall and that everyone is safe. Hope Islamabad city has high rise fire fighting equipment and SAR equipped helicopter in the event of higher floor evacuations. Building vertical cities requires this kind of equipment. Prayers for everyone. pic.twitter.com/QntPu2SMZZ
— Fakhr-e-Alam S.I & S.E (@falamb3) October 9, 2022
https://twitter.com/deejasays/status/1579084695421489152?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579084695421489152%7Ctwgr%5E177146418329b46c363a9146a1b6642cd80205d1%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fworld-news%2Fmajor-fire-breaks-out-at-centaurus-mall-in-pakistans-islamabad-3416029
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

