Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
Houthis | ఇస్లాం మతానికి పవిత్ర నగరాలైన మక్కా (Mecca), మదీనా (Medina) లను తాము లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డామన్న వార్తలను యెమెన్ (Yemen) కు చెందిన ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) ఖండించారు. తమ లక్ష్యం కేవలం సౌదీ అరేబియా (Saudi Arabia) లోని చమురు శుద్ధి కర్మాగారాలు, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు మాత్రమేనని స్పష్టంచేశారు.
Houthis : ఇస్లాం మతానికి పవిత్ర నగరాలైన మక్కా (Mecca), మదీనా (Medina) లను తాము లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డామన్న వార్తలను యెమెన్ (Yemen) కు చెందిన ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) ఖండించారు. తమ లక్ష్యం కేవలం సౌదీ అరేబియా (Saudi Arabia) లోని చమురు శుద్ధి కర్మాగారాలు, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు మాత్రమేనని స్పష్టంచేశారు.
కాగా మక్కా, మదీనా ప్రాంతాలవైపు హౌతీలు క్షిపణులను ప్రయోగించారని, ఆ బాలిస్టిక్ క్షిపణులను తాము అడ్డుకున్నామని, వాటి శకలాలు కిందపడ్డాయని ముందుగా సౌదీ అరేబియా ప్రకటించింది. శనివారం సౌదీ దళాలు రెండు బాలిస్టిక్ క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేశాయని, ఈ క్రమంలో మక్కా సమీపంతోపాటు జెడ్డా, తాయిఫ్, రబీఘ్ ప్రాంతాల్లో క్షిపణి శకలాలు పడ్డాయని సౌదీ సివిల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. యన్బు, తాయిఫ్లను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన రెండు క్షిపణులను నాశనం చేశామని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు పేర్కొన్నాయి.
అయితే ఈ దాడులపై హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ భిన్నమైన ప్రకటన చేశారు. తాము రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం, యన్బులోని అరామ్కో చమురు కేంద్రం, రబీఘ్ ఆయిల్ రిఫైనరీ, పలు చమురు పంపింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ విమానాశ్రయం, నజ్రాన్‌లోని ఎయిర్‌పోర్ట్‌పైనా దాడి చేశామన్నారు. అయితే ఈ దాడులు లక్ష్యాన్ని చేరుకున్నాయా..? లేదా..? అనేదానిపై సౌదీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘర్షణలు యెమెన్ దక్షిణ ప్రాంతానికీ విస్తరించాయి.
అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏడెన్ నగరంలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంపై మూడు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. సౌదీ అధికారులు ఉన్న సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ దాడులతో మరింత బలహీనపడింది. యెమెన్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి సౌదీ సంకీర్ణ దళాలు మద్దతిస్తుండగా, రాజధాని సనాతోపాటు ఉత్తర యెమెన్‌లో అధిక భాగం హౌతీల నియంత్రణలో ఉందన్నారు.
కాగా పవిత్ర నగరాలను లక్ష్యంగా చేసుకోవడం తమ ఉద్దేశం కాదని, అలాంటి వార్తలు అవాస్తవమని హౌతీలు పునరుద్ఘాటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- houthis
- Mecca
- Medina
- saudi arabia
RELATED ARTICLES
తాజా వార్తలు
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

