Hong Kong : కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో చాలా దేశాలు విదేశీ పర్యాటకులను అనుమతిస్తున్నాయి. అంతేకాదు కరోనా నిబంధనలను కూడా సడలించాయి. తాజాగా హాంకాంగ్ కూడా విదేశీ సందర్శకులపై కరోనా ఆంక్షల్ని ఎత్తేసింది. డిసెంబర్ 13వ తేదీ (బుధవారం) నుంచి హాంకాంగ్‌కు వచ్చే పర్యాటకులకు కొవిడ్ నియంత్రణలు వర్తించవని జాన్ లీ అనే అధికారి మంగళవారం తెలిపారు. అంతేకాదు జీపీఎస్ సాయంతో పనిచేసే మొబిలిటీ ట్రాకింగ్ కరోనా యాప్‌ను కూడా నిలిపివేసింది. ‘హాంకాంగ్‌కు వచ్చే పర్యాటకులపై ఏ విధమైన ఆంక్షలు ఉండవు. అదే రోజు వాళ్లు నచ్చిన ప్లేస్‌కు వెళ్లొచ్చు. అయితే, అధికారులు అడిప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నట్టు గుర్తుగా ఫొటో లేదా సర్టిఫికెట్ చూపిస్తే చాలు’ అని ఆరోగ్య శాఖ కార్యదర్శి లీ చుంగ్ మా వెల్లడించారు.
బుధవారం నుంచి హాంకాంగ్‌కు వచ్చే పర్యాటకులు, విదేశాల నుంచి వచ్చే దేశ ప్రజలకు కూడా విమానాశ్రయంలో కరోనా టెస్ట్ చేస్తారు. నెగెటివ్ వచ్చిన వాళ్లను బార్లు, రెస్టారెంట్లలోకి అనుమతిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆ దేశంలోని పర్యాటక రంగం, వ్యాపార రంగం ఊపందుకోనున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మళ్లీ జనంతో కిటకిటలాడనున్నాయి. అయితే .ప్రస్తుతం విదేశీ పర్యాటకులు, ఇతర దేశాల నుంచి వచ్చే స్వదేశస్థులకు ఒక కోడ్ ఇస్తున్నారు. వాళ్లను మూడు రోజుల పాటు అక్కడి బార్లు, రెస్టారెంట్లలోకి అనుమతించేవాళ్లు కాదు.