అబుదాబి, జూలై 26: రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో యూఏఈలోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. 27 ఏండ్లలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని స్థానిక వాతావరణ విభాగం పేర్కొన్నది. ఫుజైరా నగరంలోని పోర్టు ఏరియాలో 25.52 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.
షార్జాతో పాటు ఫుజైరా నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పర్వత, లోయ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 200 మందిని కాపాడారు.