‘హవానా సిండ్రోమ్’!

- ఇటీవల భారత్‌కి వచ్చిన అమెరికా అధికారిలో గుర్తింపు
- వ్యాధిని గుర్తించి ఐదేైండ్లెనా.. అంతుచిక్కని కారణాలు
- బాధితుల్లో వికారం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు
- మైక్రోవేవ్ తరంగాలతోనే సిండ్రోమ్ వస్తున్నట్టు అనుమానాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఐదేండ్ల క్రితం విదేశాల్లో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని రోగం ‘హవానా సిండ్రోవ్‌ు’ తొలి కేసు భారత్‌లో నమోదైంది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ విలియవ్ు బర్న్స్‌తో కలిసి భారత్‌లో ఈ నెల మొదట్లో పర్యటించిన అధికారి ఒకరిలో హవానా సిండ్రోవ్‌ు లక్షణాలు కనిపించినట్టు అమెరికా వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆ బాధిత వ్యక్తి చికిత్స పొందాల్సి ఉన్నదని పేర్కొన్నాయి.
ఏమిటీ ‘హవానా సిండ్రోవ్‌ు’?
క్యూబా రాజధాని హవానా నగరంలో 2016లో తొలిసారిగా ఈ వ్యాధిని గుర్తించారు. ఆ నగరం పేరుమీదుగా దీన్ని ‘హవానా సిండ్రోవ్‌ు’గా పిలుస్తున్నారు. క్యూబాలోని ఓ హోటల్ గదుల్లో దిగిన అమెరికా దౌత్యవేత్తలు ఉన్నట్టుండి కొంత అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నిమిషాల్లోనే.. వారిలో వికారం, తీవ్రమైన తలనొప్పి, అలసట, నిద్ర సమస్యలు, మైకం, వినికిడి లోపం, ఒళ్లు నొప్పులు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. గదుల్లోపల వింత శబ్దాలు విన్న అనంతరం బాధితుల్లో ఈ సమస్యలు తలెత్తినట్టు వైద్యులు ప్రాథమికంగా అంచనా వేశారు. గత ఐదేండ్లలో దాదాపు 200 మంది అమెరికా దౌత్య సిబ్బంది, గూఢచారులు, వారి కుటుంబ సభ్యుల్లో ఈ సిండ్రోవ్‌ు లక్షణాలు గుర్తించినట్లు చెప్పారు.
ఎందుకు ఇలా జరుగుతుంది?
‘హవానా సిండ్రోవ్‌ు’ రావడానికి గల కారణాలను ఇప్పటికీ వైద్యులు, శాస్త్రవేత్తలు కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు. అయితే, మైక్రోవేవ్ తరంగాలు ప్రసారం కావడం వల్ల అవి బాధితుల మెదడుపై ప్రభావం చూపి ఈ సిండ్రోమ్ తలెత్తుతున్నట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎన్ఏఎస్) ఓ నివేదికలో అనుమానం వ్యక్తం చేసింది. అయితే, విదేశీ వ్యవహారాల విభాగం ఒత్తిడితో కూడుకున్నదని.. అందుకే ఈ మానసిక సమస్యలు కనిపిస్తున్నట్టు మరికొందరు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

