Mohammed Deif | హమాస్‌కు కోలుకోని దెబ్బ.. మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ దుర్మరణం..!
Mohammed Deif | గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న హమాస్‌కు కోలుకోని షాక్ తగిలింది. ఇప్పటికే సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు.
Mohammed Deif | గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న హమాస్‌కు కోలుకోని షాక్ తగిలింది. ఇప్పటికే సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ గురువారం ధ్రువీకరించింది. మిస్సైల్ దాడుల్లో డీఫ్ మృతి చెందినట్లు పేర్కొంది. డీఫ్ అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడికి సూత్రధారిగా భావిస్తున్నారు. జూలై 13న ఐడీఎఫ్ ఫైటర్ జెట్లు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో బ్రిగేడ్ కమాండర్ మొహ్మద్ డీఫ్, రఫా సలామెహ్ ఉన్న కాంపౌండ్‌పై దాడి చేసింది.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అతన్ని హతమార్చేందుకు ఇజ్రాయెల్ ఏడుసార్లు ప్రయత్నించగా డీఫ్ తప్పించుకుంటూ వచ్చి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌లో హమాస్ భారీగా మిస్సైళ్లతో దాడులకు దిగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 7 నాటి మారణకాండకు ప్రధాన సూత్రధారి డీఫ్గా ఇజ్రాయెల్ భావిస్తున్నది. మరో వైపు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో డీఫ్ పేరు ముందువరుసలో ఉన్నది. గతంలో ఆత్మాహుతి బాంబు దాడుల్లో డజన్ల కొద్దీ ఇజ్రాయిలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనల్లో డీఫ్ హస్తం ఉన్నది.
Read Also :
-
Donald Trump: ఆమె భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా?.. కమలా హ్యారిస్ మూలాలపై డోనాల్డ్ ట్రంప్
-
Khaled Mashal | హమాస్ రాజకీయ విభాగం చీఫ్ హనియా స్థానంలో ఖలీద్ మషాల్..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

