COVID vaccine: బూస్టర్ డోస్‌లు ఇప్పుడే వద్దంటున్న డబ్ల్యూహెచ్‌వో
కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే వ్యాక్సినేషన్( COVID vaccine )ను వేగంగా పూర్తి చేస్తున్న కొన్ని దేశాలు ఇక బూస్టర్ డోసుల వైపు చూస్తున్నాయి. ఎక్కువ కాలం ఈ మహమ్మారి నుంచి రక్షణ కోసం ఈ బూస్టర్ డోసులను ఇవ్వాలని నిర్ణయించారు.

జెనీవా: కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే వ్యాక్సినేషన్( COVID vaccine )ను వేగంగా పూర్తి చేస్తున్న కొన్ని దేశాలు ఇక బూస్టర్ డోసుల వైపు చూస్తున్నాయి. ఎక్కువ కాలం ఈ మహమ్మారి నుంచి రక్షణ కోసం ఈ బూస్టర్ డోసులను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడే బూస్టర్ డోసులు వద్దని వారిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో హెడ్ టెడ్రోస్ అదనోమ్ మీడియాతో మాట్లాడుతూ.. ధనిక దేశాలు వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నాయి. ఇప్పటికే 100 మందికి 100 డోసులు ఇస్తున్నాయి. అదే పేద దేశాలు మాత్రం వంద మందికి కేవలం 1.5 డోసులు మాత్రమే ఇచ్చాయి. వాళ్లకు వ్యాక్సిన్లు సరఫరా తగ్గి ఈ పరిస్థితి తలెత్తింది అని టెడ్రోస్ చెప్పారు.
ఈ పరిస్థితిని మనం అర్జెంటుగా మార్చాలి. ధనిక దేశాలకే మెజార్టీ వ్యాక్సిన్లు వెళ్తున్నాయి. ఇప్పుడు మెజార్టీ వ్యాక్సిన్లు పేద దేశాలకు వెళ్లాలి. అందుకే కనీసం సెప్టెంబర్ చివరి వరకైనా బూస్టర్ డోసులను ఆపాలి అని టెడ్రోస్ సూచించారు. ప్రతి దేశం కనీసం 10 శాతం జనాభాకు వ్యాక్సిన్లు ఇచ్చే వరకూ బూస్టర్ డోసుల జోలికి వెళ్లొద్దని ఆయన అన్నారు. ఆ దిశగా అన్ని దేశాల్లోని ప్రముఖులు ప్రచారం చేయాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

