జీవీకేకు బ్యాంకుల షాక్
లండన్, జూన్ 11: జీవీకే గ్రూప్ సబ్సిడరీ జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) చెల్లించాల్సిన రుణంపై ఆరు భారతీయ బ్యాంక్‌లు లండన్ హై కోర్టులో కేసు దాఖలు చేసినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్- ఈ ఆరింటికి కలిపి 1.5 బిలియన్ డాలర్ల (రూ.12,114 కోట్లు) రుణాన్ని వడ్డీతో కలిపి జీవీకే కోల్ డెవలపర్స్ చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలకు గ్యారంటార్లుగా ఉన్న తొమ్మిది జీవీకే గ్రూప్ కంపెనీలపై (ఏడు సింగపూర్ సంస్థలు, రెండు సికింద్రాబాద్ కంపెనీలు) కూడా బ్యాంక్‌లు దావా వేశాయి. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. 2011లో జీవీకేకు బ్యాంక్‌లు 1 బిలియన్ డాలర్ల రుణం జారీ, 35 మిలియన్ డాలర్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ సదుపాయం కల్పించడంతోపాటు 2014లో 160 మిలియన్ డాలర్లకుపైగా రుణం ఇచ్చిన అంశంపై ఈ వివాదం ఏర్పడింది. ఇదిలావుంటే తాము ఏ ఒప్పందాల్ని ఉల్లంఘించలేదని, 1.5 బిలియన్ డాలర్ల రుణ బకాయిలు ఉన్నాయన్న వాదనను జీవీకే ఖండించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

