డెన్మార్క్‌తోనే కొనసాగుతాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాధీన హెచ్చరికల నేపథ్యంలో తాము డెన్మార్క్ యూనియన్లోనే కొనసాగుతామని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సన్ విస్పష్ట ప్రకటన చేశారు.
- గ్రీన్లాండ్ ప్రధాని స్పష్టీకరణ
- అది మీకే పెద్ద సమస్య: ట్రంప్
న్యూఢిల్లీ, జనవరి 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాధీన హెచ్చరికల నేపథ్యంలో తాము డెన్మార్క్ యూనియన్లోనే కొనసాగుతామని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సన్ విస్పష్ట ప్రకటన చేశారు. అమెరికా, డెన్మార్క్‌లలో ఏదేశంతో కొనసాగుతారని తమకు ఎంపిక అవకాశం ఇస్తే తాము యూరోపియన్ యూనియన్‌లో భాగంగానే ఉంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి స్వాతంత్య్రాన్ని కోరే ఆలోచనలను పక్కనపెట్టామని కూడా ఆయన తెలిపారు. కాగా, గ్రీన్లాండ్ ప్రధాని ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం ప్రకటించారు. ఇది ఆ దేశానికి పెద్ద సమస్యను సృష్టించగలదని హెచ్చరించారు. బుధవారం కోపెన్‌హాగెన్‌లో డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సన్తో కలసి సంయుక్త విలేకరుల సమావేశంలో గ్రీన్లాండ్ ప్రధాని మాట్లాడుతూ తాము ఇప్పుడు భౌగోళిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, అమెరికా, డెన్మార్క్‌లో ఏదో ఒక దేశాన్ని ఎంచుకోవలసి వస్తే తాము డెన్మార్క్నే ఎంచుకుంటామని చెప్పారు.
ప్రస్తుతం డెన్మార్క్ రాజ్యంలో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ అలాగే కొనసాగాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. బుధవారం వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో డానిష్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రులు సమావేశం కావడానికి ముందు గ్రీన్లాండ్ ప్రధాని నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నయానో భయానో గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని నీల్సన్ తెలిపారు. నీల్సన్ తాజా వ్యాఖ్యల గురించి విలేకరులు ట్రంప్‌ని ప్రశ్నించగా ఆ దేశానికి ఇది పెద్ద సమస్యను సృష్టించగలదని హెచ్చరించారు. వారితో తాను ఏకీభవించనని, ఆయన(నీల్సన్) గురించి తనకు ఏమీ తెలియదని, అయితే ఆయన పెద్ద సమస్యను ఎదుర్కోక తప్పదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణ తప్ప ఏదీ సమ్మతం కాదు: ట్రంప్
దేశ భద్రత కోసం గ్రీన్లాండ్ చాలా అవసరమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ఇచ్చిన పోస్ట్‌లో చెప్పారు. తాము నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ కోసం గ్రీన్లాండ్ అత్యంత కీలకమైనదన్నారు. అమెరికా చేతిలో గ్రీన్లాండ్ ఉంటే, నాటో మరింత పటిష్టం, బలోపేతం అవతుందని తెలిపారు. అంతకు తక్కువైనదేదీ ఆమోదయోగ్యం కాదన్నారు. డానిష్, గ్రీన్లాండ్ ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు వైట్ హౌస్‌కు రాబోతుండగా ఆయన ఈ పోస్ట్ పెట్టారు. వీరు గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియోలతో చర్చలు జరుపుతారు. డానిష్ డిఫెన్స్ మినిస్టర్ ట్రోయెల్స్ లుండ్ పౌల్సెన్ గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఆందోళనను తగ్గించేందుకు ప్రయత్నించారు. డెన్మార్క్ తన సైన్యాన్ని గ్రీన్లాండ్లో పెంచుతుందని, ఈ విషయంలో నాటోతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మల్టీ లేయర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను నిర్మించడానికి నాటో నాయకత్వం వహించాలని ట్రంప్ అన్నారు. “మనం చేయకపోతే, రష్యా లేదా చైనా చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు” అని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

