మనవళ్లను కాపాడబోయి సముద్రంలో మునిగిపోయిన తాత
Grandfather | ఇద్దరు అబ్బాయిలు. తమ తాతా అమ్మమ్మలతో సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లారు. సముద్రం ఒడ్డున ఆటుకుంటున్నారు.

ఎథెన్స్: ఇద్దరు అబ్బాయిలు. తమ తాతా అమ్మమ్మలతో సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లారు. సముద్రం ఒడ్డున ఆటుకుంటున్నారు. ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల వల్ల వారు సముద్రంలోపలికి వెళ్తున్నారు. గమనించిన తాత వారిని రక్షించడానికి సముద్రంలోకి వెళ్లారు. అయితే బాలురు క్షేమంగా బయటపడగా, తాత మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గ్రీస్‌లోని క్రీట్ ద్వీపంలో చోటుచేసుకుంది.
సెలవు రోజు కావంతో బ్రిటన్‌కు చెందిన 61 ఏండ్ల వృద్ధుడు తన మనవళ్లతో కలిసి గ్రీస్‌లోని క్రీట్ ద్వీపంలో బీచ్‌కు వెళ్లాడు. 7, పదేండ్ల వయస్సు కలిగిన ఆ ఇద్దరు బాలురు సముద్రంలో సరదాగా ఆడుకుంటున్నాయి. అయితే ఒక్కసారిగా అలలు పోటెత్తడంతో వారు సముద్రంలోపలికి వెళ్లిపోతున్నారు. తన మనవళ్లు ఆపదలో ఉన్నారని గమనించిన తాత.. వారిని కాపాడటానికి ప్రయత్నించాడు. అయితే ఆ ఇద్దరు చిన్నారులు క్షేమంగా బయటపడగా, వృద్ధుడు మాత్రం చనిపోయాడని గ్రీస్ కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- British
- Crete
- grandfather
- Grandsons
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

