గోటబయ రాజపక్సకు సుప్రీంకోర్టు సమన్లు
Gotabaya Rajapaksa summoned :శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆ దేశ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. శ్రీలంక పొడుజన పెరమున పార్టీకి చెందిన దుమిండ సిల్వకు క్షమాభిక్ష పెట్టిన కేసులో రాజపక్సకు సమన్లు జారీ చేయడం ఇది రెండవ సారి. 2011లో జరిగిన ఓ మర్డర్ కేసులో సిల్వా నిందితుడు. అతనికి 2017లో మరణశిక్షను ఖ
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆ దేశ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. శ్రీలంక పొడుజన పెరమున పార్టీకి చెందిన దుమిండ సిల్వకు క్షమాభిక్ష పెట్టిన కేసులో రాజపక్సకు సమన్లు జారీ చేయడం ఇది రెండవ సారి. 2011లో జరిగిన ఓ మర్డర్ కేసులో సిల్వా నిందితుడు. అతనికి 2017లో మరణశిక్షను ఖరారు చేశారు. మాజీ ఎంపీ ప్రేమచంద్ర సన్నిహితుడిని సిల్వా హత్య చేశాడు. అయితే జూన్ 2021లో అతనికి రాజపక్స క్షమాభిక్ష పెట్టారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆ క్షమాభిక్షను రద్దు చేసింది. సిల్వాను మళ్లీ అరెస్టు చేయాలని ఆదేశించింది.
డిసెంబర్ 16న రాజపక్స కోర్టుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 73 ఏళ్ల రాజపక్స జూలైలో దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. మాల్దీవులకు వెళ్లిన ఆయన సింగపూర్ నుంచి తన రాజీనామాను ప్రకటించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో రాజపక్సకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ఆయన దేశం విడిచివెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

