భూమికి వచ్చేందుకు సిద్ధంగా ఉండండి.. ఐఎస్ఎస్లోని వ్యోమగాములకు నాసా ఆదేశాలు
అంతరిక్ష కేంద్రంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతరిక్ష కేంద్రంలోని రష్యాకు చెందిన రోస్కోమస్ స్పేస్ ఏజెన్సీలోని జ్వేజ్డా విభాగంలో కొన్ని నెలల తరబడి గాలి లీక్ అవుతున్నది.
- రష్యా విభాగంలో ఎయిర్ లీక్
న్యూయార్క్, జూన్ 5: అంతరిక్ష కేంద్రంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతరిక్ష కేంద్రంలోని రష్యాకు చెందిన రోస్కోమస్ స్పేస్ ఏజెన్సీలోని జ్వేజ్డా విభాగంలో కొన్ని నెలల తరబడి గాలి లీక్ అవుతున్నది. మొన్నటిదాకా పరిస్థితి స్థిరంగా ఉన్నా.. సోమవారం నాటికి గాలి లీక్ తీవ్రత భారీగా పెరిగిపోయింది. దీంతో క్రూ-12 మిషన్‌కు చెందిన నలుగురు వ్యోమగాములను వెంటనే వారికోసం ఏర్పాటు చేసిన క్రూ డ్రాగన్ మిషన్‌లోకి వెళ్లి స్పేస్ సూట్లను ధరించాలని నాసా ఆదేశించింది. కుదిరితే తరలింపునకు సిద్ధంగా ఉండాలని తెలిపింది.
ఇందులో ఇద్దరు అమెరికన్, ఒక ఫ్రెంచ్, ఒక రష్యన్ వ్యోమగామి ఉన్నారు. అంతరిక్ష కేంద్రం లో ప్రధాన ఆపరేటర్లుగా ఉన్న అమెరికా, రష్యన్ స్పేస్ ఏజెన్సీలు ఈ గాలి లీక్ మీద నెలలుగా చర్చిస్తున్నాయని నాసాకు చెందిన ఓ అధికారి తెలిపారు. పరిస్థితి కంట్రోల్లోకి రాకపోవడంతో ఈ రకమైన ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Astronauts
- Earth
- ISS
- NASA
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

