పారిస్, మే 14: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌ను ఆయన భార్య బ్రిగెట్టే మాక్రాన్ బహిరంగంగా అందరిముందు చెంప దెబ్బ కొట్టిన సంఘటనపై ఇన్నాళ్లూ జరిగిన ఊహాగానాలకు తెరపడింది. 2025 మే నెలలో వియత్నాం పర్యటనలో విమానం దిగుతుండగా, మాక్రాన్‌ను ఆయన భార్య చెంపదెబ్బ కొట్టడం సంచలనం కలిగించింది. తాము సరదాగా మాట్లాడుకుంటున్నామని, ఇది జోక్ అని అప్పట్లో ఆ ఘటనను సమర్థించుకునే ప్రయత్నాన్ని మాక్రాన్ చేసినా ఎవరూ నమ్మలేదు.
మాక్రాన్‌ను అలా చెంపదెబ్బ కొట్టడానికి ఆయన ఫోన్లోని ఒక మెసేజే కారణమని ఫ్రెంచ్ జర్నలిస్టు ఫ్లోరియన్ టార్డిఫ్ తాజాగా తాను రాసిన పుస్తకంలో వెల్లడించారు. దీనంతటికీ ఇరాన్ నటి గోలిఫ్తే ఫరహానియే కారణమని, మాక్రాన్ ఫోన్లో ఆమె మెసేజ్‌ను చూసి, వారిద్దరి బంధాన్ని అనుమానించి తీవ్రంగా స్పందించిన ఫస్ట్ లేడీ కోపంతో అతడి చెంప చెళ్లుమనిపించిందని ఆయన తెలిపారు. మాక్రాన్‌కు ఆమెతో కొన్ని నెలల పాటు స్నేహపూర్వక సంబంధం మాత్రమే ఉందని టార్డిఫ్ వెల్లడించారు.