Emergency | స్పృహకోల్పోయిన తల్లి.. ఆ నాలుగేళ్ల పిల్లాడు చేసిన పనితో నిలిచిన ప్రాణాలు
ఎదిగే క్రమంలో పిల్లలకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పడం చాలా అవసరం. అలా చేయడమే ఒక తల్లి ప్రాణాలు కాపాడింది. ఇంట్లో ఉండగా ఆమెకు అనుకోకుండా కళ్లు తిరిగాయి. దాంతో స్పృహకోల్పోయి కింద పడిపోయింది. ఆ ఇంట్లో నాలుగేళ్ల మోంటీ తప్ప మరెవరూ లేరు. అలా తల్లి పడిపోవడం చూసిన మోంటీ.. కంగారు పడకుండా వెంటనే ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేశాడు.
‘అమ్మ కింద పడిపోయింది’ అని ఫోన్ ఆపరేటర్‌కు చెప్పాడు. అలాగే తమ ఇంట్లో ఉండే కుక్క అరుస్తుందే కానీ కరవదని, కాబట్టి టెన్షన్ పడొద్దని వివరించాడు. ఈ కాల్ అందుకున్న వెంటనే అంబులెన్సు ఆ ఇంటికి చేరుకుంది. కళ్లు తిరిగి పడిపోయిన వెండీని వాళ్లు కాపాడారు. ఈ ఘటన టాస్మానియాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను అంబులెన్స్ టాస్మానియా సంస్థ తమ ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది.
‘తల్లి స్పృహ కోల్పోవడం చూసిన ఈ చిన్ని ఛాంపియన్.. కంగారు పడకుండా మాకు ఫోన్ చేశాడు’ అంటూ జరిగిన విషయాన్ని వివరించింది. అలాగే అతన్ని మెచ్చుకుంటూ సర్టిఫికెట్ అందజేసింది. అంబులెన్సు సిబ్బంది చేసిన చికిత్సతో కోలుకున్న వెండీ.. తన కుమారుడిని తెగ మెచ్చుకుంది. ‘నా చిన్ని హీరో’ అంటూ సంతోషించింది.
వృత్తి రీత్యా నర్స్ అయినా ఆమె అంతకుముందు రోజే ఏదైనా కంగారుపడే ఘటన జరిగితే ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్ చేయడం ఎలాగో మోంటీకి నేర్పిందట. అది బాగా గుర్తుపెట్టుకున్న మోంటీ ఇలా తల్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. నెట్టింట ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మోంటీ చురుకుదనాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.
Four-year-old Monty called Triple-0 to help save his mum’s life – just a day after he was taught the important lesson….
Posted by Ambulance Tasmania on Monday, September 5, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

