US Woman Stabs Boyfriend In Eye | ఇతర మహిళలను చూస్తున్నందుకు.. ప్రియుడి కంటిపై పొడిచిన మహిళ
US Woman Stabs Boyfriend In Eye | ఇతర మహిళలను చూస్తున్నాడన్న ఆగ్రహంతో ఒక మహిళ తన ప్రియుడి కంటిపై సూదితో పొడిచింది. (US Woman Stabs Boyfriend In Eye) అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వాహింగ్టన్: ఇతర మహిళలను చూస్తున్నాడన్న ఆగ్రహంతో ఒక మహిళ తన ప్రియుడి కంటిపై సూదితో పొడిచింది. (US Woman Stabs Boyfriend In Eye) అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మియామీ డేడ్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి పెంపుడు కుక్కలకు రేబిస్ ఇంజక్షన్ వేయించేందుకు రెండు సూది టీకాలు తెచ్చాడు. కూర్చొని ఉన్న అతడు ఇతర ఆడవారిని చూడటంపై ప్రియురాలైన 44 ఏళ్ల సాండ్రా జిమెనెజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సూది టీకాతో అతడి కుడి కనురెప్పపై పొడిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.
కాగా, కంటికి గాయమైన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో వారు అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటి సమీపంలో కారులో నిద్రపోతూ కనిపించిన ప్రియురాలిని అరెస్ట్ చేశారు. అయితే ప్రియుడ్ని తాను గాయపర్చలేదని, అతడే గాయాలు చేసుకున్నట్లు ఆమె బుకాయించినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళపై పలు అభిమోగాలు నమోదు చేసినట్లు చెప్పారు. ఆ జంట ఎనిమిదేళ్లుగా డేటింగ్లో ఉన్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Boy friend
- eye
- Looking
- Other Women
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

