Hardeep Singh Nijjar | ఒట్టావా, మార్చి 9: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దృశ్యాలు మొదటిసారి వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది జూలై 18న కెనెడాలోని బ్రిటిష్ కొలంబియాలో పికప్ వ్యాన్‌లో వెళ్తున్న నిజ్జర్‌ను సెడాన్ కారుతో అడ్డగించిన ఆరుగురు వ్యక్తులు ఆయనపై పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరుపుతున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తున్నది.
కాల్పుల అనంతరం అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో కారులో వారు పారిపోయారు.