100 ఏళ్ల క్రితం నాటి రెండు చర్చిలకు నిప్పు పెట్టారు..

ఒట్టావా: కెనడాలో వందేళ్ల క్రితం నిర్మించిన రెండు చర్చిలను నిప్పుపెట్టి కాల్చేశారు. బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పట్ల పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్రెడ్ హార్ట్ చర్చ్, సెయింట్ జార్జ్ చర్చిలు మంటల్లో పూర్తిగా దగ్ధం అయ్యాయి. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అయితే జాతీయ స్థానిక తెగ ప్రజల దినోత్సవం రోజున ఈ ఘటన జరగడం శోచనీయం. అగ్నికి ఆహుతి అయిన ఆ రెండు చర్చిలను వందేళ్ల క్రితం నిర్మించినట్లు అధికారులు చెప్పారు. ఇటీవలే కామ్లూప్స్లో ఓ సామూహిక శ్మశాన వాటిక నుంచి సుమారు 215 మంది చిన్నారుల కళేబరాలను వెలికి తీసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఈ రెండు చర్చిలు ఉన్నాయి. 19, 20వ శతాబ్ధాల్లో వేలాది మంది స్థానిక తెగల చిన్నారులను ఆ చర్చిలకు పంపేవాళ్లు. రోమన్ క్యాథలిక్‌లు ఆ చర్చిలను నిర్వహిస్తుండేవారు. చర్చిలు తగలబడిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

