Tesla | టెస్లా షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. 17 కార్లు దగ్ధం
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) షోరూమ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) షోరూమ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇటలీ (Italy)లోని రోమ్ (Rome) శివార్లలో గల టెస్లా షోరూమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 కార్లు పూర్తిగా కాలిపోయినట్లు ఇటాలియన్ అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో షోరూమ్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) శాఖ అధిపతిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుతో టెస్లాను బహిష్కరించాలంటూ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెస్లాపై స్థానికులు దాడులు చేస్తున్నారు. షోరూమ్‌పై కాల్పులు, నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఆయా ఘటనల్లో అనేక టెస్లా కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇప్పుడు ఈ దాడులు అమెరికా వెలుపల కూడా చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే ఇటలీలో మస్క్, ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది.
మరోవైపు ఇలా వరుస దాడులపై టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. తన సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తుందన్నారు. ఇలాంటి దాడులకు కారకులైన వారిని ఏమీ చేయలేదంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఆయా ఘటనలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
“Tesla Cars | టెస్లాపై దాడి చేస్తే 20 ఏండ్లు జైలు శిక్ష తప్పదు.. ట్రంప్ కీలక హెచ్చరికలు”
“Tesla Cars | టెస్లా కార్లకు నిప్పు.. ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన మస్క్”
“Tesla Showroom | ఎలాన్ మస్క్‌పై తీవ్ర వ్యతిరేకత.. టెస్లా షోరూంపై కాల్పులు”
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar MLA Anant Singh | కుమార్తె పెళ్లి సందర్భంగా గుర్రపు పోటీలు.. విజేతకు ‘థార్’ బహుకరించనున్న ఎమ్మెల్యే
Harihara Putra | అయ్యప్ప భక్తి నేపథ్యంలో వైభవ్ ‘హరిహర పుత్ర’.. ఆకట్టుకుంటున్న టీజర్!
Komatireddy Rajagopal Reddy | ఖబడ్దార్ బిడ్డా యుద్దం స్టార్ట్ అయితది.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్
Donald Trump: ట్రంప్‌ను హత్తుకున్న జిన్‌పింగ్.. చైనాకు ఎన్విడియా చిప్స్ బంద్
Dogra Front | లష్కరే ఉగ్రవాది ఎన్కౌంటర్.. జమ్ముకశ్మీర్‌లో డోగ్రా ఫ్రంట్ సంబురాలు.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

