Fertility Rate: దక్షిణ కొరియాకు మళ్లీ షాక్.. ఇంతకీ ఆ దేశానికి ఏమైంది?
Fertility Rate : సంతానోత్పత్తి రేటు మళ్లీ పడిపోయింది. దక్షిణాఫ్రికాలో పిల్లల్ని కంటున్న మహిళల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఫెర్టిలిటీ రేటు తగ్గింది. దీంతో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ సమస్య ఎదురుకానున్నది.
సియోల్: దక్షిణ కొరియా(South Korea)లో మళ్లీ సంతానోత్పత్తి రేటు(Fertility Rate) పడిపోయింది. ఇప్పటికే అత్యల్ప స్థాయిలో ఉన్న ఆ దేశ రేటు.. ఈ ఏడాది మరింత దిగజారినట్లు నివేదికలు చెబుతున్నాయి. జనాభా పెరుగుదల కోసం ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. 2022 సంవత్సరానికి మహిళల్లో సంతాన ఉత్పత్తి రేటు సగటున 0.78కు పడిపోయినట్లు ఆ దేశ జాతీయ గణాంకాల శాఖ తెలిపింది. అంతకుముందు ఏడాది ఆ రేటు 0.81 శాతంగా ఉండేది.
ఆ దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే.. ఫెర్టిలిటీ రేటు కనీసం 2.1గా ఉండాలని నిపుణులు భావిస్తున్నారు.ఎందుకంటే ఆ దేశంలో ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలు కూడా లేవు. 2015 నుంచి సౌత్ కొరియాలో బర్త్ రేటు క్షీణిస్తోంది. ఇక 2020లో శిశు జననాల కన్నా.. చావులనే ఎక్కువ స్థాయిలో నమోదు అయ్యాయి. 2022లో ఆ దేశంలో సుమారు రెండు లక్షల 49 వేల మంది పుట్టగా.. మూడు లక్షల 72 వేల 800 మంది మరణించారు.
దక్షిణ కొరియాతో పాటు అనేక ఆసియా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేటు పడిపోతోంది. ఈ జాబితాలో జపాన్, చైనా దేశాలు కూడా ఉన్నాయి. వయసు మళ్లిన జనాభా పెరుగుతుండగా.. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మాత్రం తగ్గుతోంది. కొరియా మహిళలు చాలా లేటు ఏజ్‌లో పిల్లల్ని కంటుండడం కూడా ఓ సమస్యగా మారింది. గత ఏడాది కొరియాలో మహిళల గర్భధారణ సగటు వయసు 33.5 ఏళ్లుగా ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

