భారత్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు అమెరికాలో అరెస్ట్
భారత్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు(గ్యాంగ్‌స్టర్) హిమాంశు భౌను ఎఫ్‌బీఐ అమెరికాలో గురువారం అరెస్ట్ చేసింది.
- హిమాంశుపై 30కి పైగా కేసులు..రెడ్ కార్నర్ నోటీస్
వాషింగ్టన్: భారత్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు(గ్యాంగ్‌స్టర్) హిమాంశు భౌను ఎఫ్‌బీఐ అమెరికాలో గురువారం అరెస్ట్ చేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. లాస్ వెగాస్‌లో హిమాంశు దాక్కొన్నట్టు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించి ఎఫ్‌బీఐకి సమాచారమిచ్చాయి.
అతడిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి భారత్‌లోని వివిధ రాష్ర్టాల్లో 30కి పైగా కేసులు నమోదయ్యాయి. అతడిపై ఇంటర్‌పోల్ 2023లో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. అమెరికాలో ఉంటూనే తన నెట్వర్క్ ద్వారా హిమాంశు భారత్‌లో నేరాలకు, వ్యాపారుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడినట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

