వాషింగ్టన్: కొత్త ఉద్యోగాలు ఉండబోవని, పాత ఉద్యోగాల్లో మరిన్ని కోతలు తప్పవని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా వ్యవస్థాకుడు, సీఈవో జుకర్బర్గ్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో రిక్రూట్మెంట్ను స్తంభింపజేస్తున్నట్టు వెల్లడించారు. ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో జుకర్బర్గ్ ఈ సంగతి తెలియజేసినట్టు టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ ‘ది వెర్జ్’ పేర్కొన్నది. వచ్చే సంవత్సర కాలంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం, శక్తియుక్తులను ఇతర రంగాలకు మళ్లించడం లక్ష్యమని జుకర్బర్గ్ తెలిపారు.