రష్యా ఆయిల్ దిగుమతులపై నిషేధం
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యా ఆయిల్ దిగుమతుల్లో అధిక భాగాన్ని నిషేధించేందుకు అంగీకారం తెలిపింది. రానున్న ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతుల్లో దాదాపు 90 శాతం తగ్గించేందుకు
వచ్చే ఆర్నెల్లలో 90% తగ్గింపు
ఈయూ కీలక నిర్ణయం
స్వాగతించిన ఉక్రెయిన్
బ్రస్సెల్స్/కీవ్, మే 31: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యా ఆయిల్ దిగుమతుల్లో అధిక భాగాన్ని నిషేధించేందుకు అంగీకారం తెలిపింది. రానున్న ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతుల్లో దాదాపు 90 శాతం తగ్గించేందుకు ఈయూ నేతలు సోమవారం అంగీకరించారు. చమురు దిగుమతులపై చర్చల సమయంలో ఈయూ నేతల మధ్య భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
రష్యా ఆయిల్ దిగుమతులను బ్లాక్ చేయడాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్వాగతించారు. ఈయూ నిర్ణయంపై రష్యా అధికారి మిఖాయిల్ ఉలియానోవ్ స్పందిస్తూ.. దీని వలన నష్టం ఉన్నప్పటికీ, తాము ఇతర దిగుమతిదారులను చూసుకుంటామని అన్నారు. యుద్ధ నేరాల కింద మరో ఇద్దరు రష్యా సైనికులను ఉక్రెయిన్‌లోని ఓ న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వీరిద్దరికి పదకొండున్నరేండ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరమైన సీవీరోడోనెట్స్ను రష్యా బలగాలు సగానికి పైగా స్వాధీనం చేసుకున్నట్టు మేయర్ ఒలెక్సాండర్ స్ట్రుయిక్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ban
- European Union
- import
- Oil
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

