Elon Musk: ట్రంప్ ర్యాలీలో ఎలన్ మస్క్ సంకేతం.. నాజీ సెల్యూట్ అంటూ విమర్శలు
Elon Musk: గుండెపై కుడి చేయిని పెట్టి, ఆ తర్వాత బలంగా ఆ చేయిని గాలిలోకి విసిరాడు మస్క్. అయితే ఎలన్ ఇచ్చిన ఆ సంకేతంపై విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ ర్యాలీలో ఆయన ఇచ్చిన సెల్యూట్ నాజీలదని ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్నారు.
న్యూయార్క్: బిలియనీర్ వ్యాపారవేత్త, టెస్లా సీఈవో ఎలన్ మస్క్(Elon Musk) ఇచ్చిన సంకేతం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాద్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన ర్యాలీలో మస్క్ పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో విజయోత్సవ సందేశాన్ని ఇస్తూ మస్క్ ఓ సంకేతం చేశారు. తన కుడి చేయిని గుండెపై పెట్టి, ఆ తర్వాత దాన్ని బలంగా గాలిలోకి విసిరారు. ఆ సంకేత సందేశం పట్ల ఆన్లైన్లో విమర్శలు వస్తున్నాయి.
ట్రంజ్ విజయానికి మీరు కారణమంటూ.. మస్క్ ప్రజల్ని ఉద్దేశించి థ్యాంక్స్ తెలిపారు. అదే క్రమంలో ఇచ్చిన సంకేతం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గాలిలోకి బలంగా చేయిని విసరడాన్ని బట్టి, అది నాజీ సెల్యూట్ అంటూ కొందరు ఆన్లైన్లో కామెంట్ చేస్తున్నారు. క్యాపిటల్ వన్ ఎరినాలో జరిగిన ర్యాలీలో మస్క్ ఆ సంకేతాన్ని ఇచ్చారు.
DO NOT BELIEVE THE MEDIA
The media is misleading you. Elon Musk never did a Nazi salute. Watch the full video: He simply gestured and said, “Thank you, my heart goes out to you.” pic.twitter.com/e3vBaLoVqx
— DogeDesigner (@cb_doge) January 20, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Elon Musk
- gesture
- Trump rally
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

