వృద్దుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్.. ఎలాగో తెలుసా?
ఒక వృద్ధుడి ప్రాణాలను డ్రోన్ కాపాడింది. అది రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఇంతకీ ఆ డ్రోన్ ఎలా ఆ వృద్ధుడి ప్రాణాలు కాపాడిందో తెలుసుకుందాం రండి.
స్వీడన్‌కు చెందిన 71 ఏళ్ల ఓ వ్యక్తికి తన ఇంటి బయట గార్డెన్లో ఉండగా హార్ట్ ఎటాక్ వచ్చింది.

అదే సమయంలో అటు వైపు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి అతడిని చూసి దగ్గరికి వెళ్లాడు. అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని గుర్తించి వెంటనే సీపీఆర్ చేయబోయాడు. పక్కన ఉన్న మరో వ్యక్తిని వెంటనే 112కి కాల్ చేసి అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వు అని చెప్పాడు. చెప్పిన 3 నిమిషాలలోనే ఓ డ్రోన్ ఎగురుకుంటూ వచ్చి తన ఇంటి ముందు defibrillator ను విడిచి వెళ్లింది. Emergency Medical Aerial Delivery service నుంచి ఆ డ్రోన్‌ను పంపించారు. అంబులెన్స్ కంటే ముందు డ్రోన్ వెళ్లి డీఫిబ్రిలేటర్‌ను వదలడంతో దానితో అతడి ప్రాణాలను కాపాడాడు ఆ వ్యక్తి.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రావడానికి సమయం తీసుకుంటే.. వెంటనే డ్రోన్ ద్వారా కావాల్సిన మెడిసిన్‌ను పంపించడం కోసం స్వీడన్‌లోని మెడికల్ యూనివర్సిటీ కరోలిన్స్కా, నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేటర్ ఎస్‌వోఎస్ Everdrone సంయుక్తంగా ఈ డ్రోన్‌ను రూపొందించాయి.
డ్రోన్ వెళ్లాల్సిన లొకేషన్‌ను ఫిక్స్ చేసి.. మ్యాప్స్ ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తూ పంపిస్తారు. డెస్టినేషన్ రాగానే.. డ్రోన్ తీసుకెళ్లిన వస్తువులను అక్కడే విడిచిపెట్టి.. డ్రోన్ తిరిగి వెనక్కి వచ్చేలా రిమోట్‌తో ఆపరేట్ చేస్తారు. స్వీడన్లో ఈ డ్రోన్‌ను ప్రస్తుతం మెడికల్ డెలివరీ సర్వీస్‌లా వాడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

