Donald Trump | మాజీ పర్సనల్ లాయర్‌పై ట్రంప్.. 500 మిలియన్ డాలర్లకు దావా!
Donald Trump | గతంలో తన వ్యక్తిగత న్యాయవాదిగా పని చేసిన మైఖేల్ కొహెన్ కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు 500 మిలియన్ డాలర్లకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా వేశారు.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గతంలో తన వ్యక్తిగత న్యాయవాదిగా పని చేసిన మైఖేల్ కొహెన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ప్రచారానికి పాల్పడి మైఖేల్ కొహెన్ కాంట్రాక్ట్ ఉల్లంఘించాడని ట్రంప్ ఆరోపించారు. ఒక పోర్న్‌స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించి, అనైతిక ఒప్పందం కుదుర్చుకున్నారన్న కేసులో ట్రంప్ అరెస్ట్ అయి, బెయిల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో తనకు వ్యక్తిగత న్యాయవాదిగా పని చేసిన మైఖేల్ కొహెన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో తనకు నష్టం కలిగించినందుకు మైఖేల్ కొహెన్ రూ.4000 కోట్లు (500 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ దావా దాఖలు చేశారు.
పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్‌తో డొనాల్డ్ ట్రంప్ అనైతిక ఒప్పందం కేసులో మైఖేల్ కొహెన్ కీలక సాక్షి. అటార్నీ-క్లయింట్ మధ్య సంభాషణను సీక్రేట్‌గా ఉంచడంలో తన వ్యక్తిగత న్యాయవాదిగా మైఖేల్ కొహెన్ విఫలం అయ్యారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తనపై పలు బుక్స్, పాడ్‌కాస్ట్ సిరీస్, ఇతర మీడియాల్లో తప్పుడు బహిరంగ ప్రకటనలతో మైఖేల్ కొహెన్ కాంట్రాక్ట్ ఉల్లంఘించారని ట్రంప్ ఆరోపించారు.
కొహెన్ అనుచితంగా వ్యవహరించిన తీరు తారాస్థాయికి చేరడంతో ట్రంప్‌కు కోర్టును ఆశ్రయించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోయిందని, ట్రంప్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై న్యాయ విచారణతోపాటు తనకు జరిగిన నష్టానికి 500 మిలియన్ డాలర్లు చెల్లించాలని కొహెన్‌ను డిమాండ్ చేస్తూ దావావేశారు. అయితే, ట్రంప్ దావా నిరుపయోగమైందని మైఖేల్ కొహెన్ తరఫు న్యాయవాది లానీ డేవిస్ తోసిపుచ్చారు. మైఖేల్ కొహెన్‌పై బెదిరింపులు, వేధింపులతో డొనాల్డ్ ట్రంప్.. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

