Eiffel Tower | ఈఫిల్ టవర్ తగలబడిందా.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
Eiffel Tower : ప్రపంచంలోనే అత్యధిక మంది టూరిస్టులను ఆకర్షిస్తున్న పర్యాటక ప్రదేశాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉంది. అయితే, ఇప్పుడు ఈ టవర్ తగలబడింది అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంలో నిజమెంత..?
Eiffel Tower : ఈఫిల్ టవర్.. దీని గురించి తెలియని వారు చాలా అరుదు. ప్రపంచంలోనే అత్యధిక మంది టూరిస్టులను ఆకర్షిస్తున్న పర్యాటక ప్రదేశాల్లో ఇదీ ఒకటి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉంది. అయితే, ఇప్పుడు ఈ టవర్ తగలబడింది అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంలో నిజమెంత..?
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్యారిస్‌లో జరిగిన అల్లర్లు, గొడవలే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ రాజధాని, టూరిస్టులకు ఫేవరెట్ ప్లేస్ అయిన ప్యారిస్ నగరంలో ఇలాంటి దుస్తితి ఏంటని చాలా మంది యూజర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం.. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫొటోలు, వీడియోలే. మూడు రోజుల క్రితం ఛాంపియన్స్ లీగ్‌లో ప్యారిస్ సెయింట్ జెర్మైన్ టీమ్ విజయం సాధించడంతో అక్కడి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కాకపోతే ఈ వేడుకలు హద్దుదాటి తీవ్ర హింసకు దారి తీశాయి. రోడ్లపై వేలాది మంది దూసుకెళ్తూ హింసకు పాల్పడ్డారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు. తగులబెట్టారు. అందులోనూ టూరిస్ట్ స్పాట్ అయిన ఈఫిల్ టవర్‌కు కూడా మంటలు అంటుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈఫిల్ టవర్ చుట్టూ మంటలు అంటుకుని, పొగ పైకి ఎగసిపడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈఫిల్ టవర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ, టవర్ చుట్టూ చాలా మంది కార్లు, ఇతర వాహనాల్ని ద్వంసం చేసి తగులబెట్టారు. దీనికి సంబంధించిన పొగ అంతా టవర్ చుట్టూ అలుముకుంది. పర్యాటకులతో సందడిగా ఉండే ఈ ప్రాంతమంతా హింసతో నిండిపోయింది.
La Tour Eiffel est noyée sous un nuage de fumée après un départ de feu sur les quais de seine.
Situation toujours très tendue dans ce secteur.#PSG #PSGARS #Arsenal #UCLfinal #Paris pic.twitter.com/89XVXjfRho
— Luc Auffret (@LucAuffret) May 31, 2026
అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్తితి ప్రశాంతంగానే ఉంది. పోలీసులు ప్యారిస్‌లో దాడులకు పాల్పడిన వారిలో దాదాపు 900 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సహా అనేక మంది ఇక్కడి హింసపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హింసలో వేలకొద్దీ వాహనాలు, వందలకొద్దీ షాపులు ధ్వంసమయ్యాయి. ఫ్రెంచ్ విప్లవం సాధించి వందేళ్లు పూర్తైన సందర్బంగా 1889లో ఈఫిల్ టవర్‌ను నిర్మించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

