కోపెన్హెగన్: డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉన్న ఫీల్డ్స్ షాపింగ్ మాల్లో ఇవాళ ఓ షూటర్ కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. గన్‌తో మాల్‌కు ఎంటర్ అవుతున్న ఆ షూటర్ ఫోటోను రిలీజ్ చేశారు. షార్ట్స్ వేసుకుని, డార్క్ టాప్‌తో ఉన్న అతను చేతుల్లో గన్ ధరించాడు. భుజంపై ఆయుధాన్ని పట్టుకుని వచ్చిన ఆ వ్యక్తి ఆ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్‌లో పరుగులు తీస్తూ కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై కోపెన్హెగన్ పోలీసు చీఫ్ సోరెన్ థామసన్ ప్రకటన చేశారు. ఇది ఉగ్ర చర్య కాదు అని, తుపాకీతో బీభత్సం సృష్టించిన ఆ ఉన్మాదికి మానసిక సమస్యలు ఉన్నట్లు తెలిపారు. కాల్పుల్లో చనిపోయిన బాధితులకు ఉన్మాదితో సంబంధాలు లేవని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఫీల్డ్స్ మల్టీస్టోరీ షాపింగ్ మాల్ .. డెన్మార్క్‌లో పెద్ద షాపింగ్ సెంటర్. దీంట్లో 140 షాపులు, రెస్టారెంట్లు ఉన్నాయి. రాజధాని కోపెన్హెగన్ కు శివారు ప్రాంతంలో ఉంది. అక్కడున్న సబ్వే సెంటర్‌తో సిటీ కనక్ట్ అవుతుంది. అయితే షాపింగ్ సెంటర్ సమీపంలో ఉన్న ఓ ఆడిటోరియంలో ఆదివారం హ్యారీ స్టయిల్స్ షో జరగాల్సి ఉంది. ఆ షోను రద్దు చేశారు. ఆ షాపంగ్ సెంటర్ వద్ద ఓ హై స్కూల్‌తో పాటు వర్సిటీ కూడా ఉంది.