delta variant | చైనాలో డెల్టా వేరియంట్ కలకలం
Delta variant | కరోనా ఉనికిలోకి వచ్చిన అనంతరం తిరిగి సాధారణ స్థితికి చేరిన చైనాలో తాజాగా డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది.

బీజింగ్: చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. డెల్టా వేరియంట్ ( Delta variant ) కలకలం రేపుతున్నది. తూర్పు చైనా నగరమైన నాన్జింగ్ విమానాశ్రయంలో 9 మంది క్లీనర్ల నుంచి మొదలైన కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతున్నది. కరోనా ఉనికిలోకి వచ్చిన అనంతరం తిరిగి సాధారణ స్థితికి చేరిన చైనాలో తాజాగా డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది.
మాస్ టెస్టింగ్, క్వారంటైన్ నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ గత కొన్ని రోజులుగా డజన్ల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు వైరస్ వేరియంట్ వ్యాపిస్తున్నది. బీజింగ్లో ఆరు నెలల తర్వాత తొలిసారి గురువారం స్థానికంగా వ్యాప్తి చెందిన కరోనా కేసు నమోదైంది. ఇటీవల నాన్జింగ్కు వెళ్లిన వారి నుంచి కరోనా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో గురువారం నాటికి చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య 200కు చేరింది. కరోనా నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకున్న కొవిడ్ జీరో ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాపించడంపై ఆ దేశ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

