Nancy Pelosi | డ్రాగన్‌పై నాన్సీ పెలోసీ సంచలన వ్యాఖ్యలు.. టిబెట్ సంస్కృతిని చెరిపేందుకు చైనా యత్నం
Nancy Pelosi | టిబెట్ సంస్కృతిని చెరిపివేయడానికి చైనా ప్రయత్నిస్తున్నదని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు.
Nancy Pelosi | టిబెట్ సంస్కృతిని చెరిపివేయడానికి చైనా ప్రయత్నిస్తున్నదని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న నాన్సీ పెలోసీ.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో బౌద్ధమత గురువు దలైలామాతో సమావేశం అయ్యారు. ఆమెతోపాటు అమెరికా చట్టసభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ మెక్ కాల్, ఇతర సభ్యులు ఉన్నారు.‘గతంలోనూ అమెరికాలో చైనా అధ్యక్షుడు పర్యటించినప్పుడూ ఇదే విషయం చెప్పా. టిబెట్ సంస్కృతిని చెరేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకించాను. అయితే, టిబెట్ లో చైనా చేస్తున్న అభివృద్ధిని చూడాలని నాతో ఆయన చెప్పారు. అందుకు నేను ధన్యవాదాలు తెలిపా. 25 ఏండ్లుగా టిబెట్ వీసా కోసం ప్రయత్నిస్తున్నా’ అని నాన్సీ పెలోసీ చెప్పారు.
భాష వాడకాన్ని తగ్గించి టిబెట్ సంస్కృతిని చెరిపేందుకు చైనా ప్రయత్నాలను అమెరికా ఎంత మాత్రం సాగనివ్వబోదని నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ఈ విషయమై చైనాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవసరమైన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో సంతకం చేస్తారన్నారు. ‘రిసాల్వ్ టిబెట్’ చట్టంపై టిబెట్ నేతలతో చర్చించాలని చైనాను కోరనున్నట్లు చెప్పారు. తొలుత టిబెట్ లో పర్యటించిన నాన్సీ పెలోసీ టీం… అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు చేరుకుని దలైలామాతో భేటీ కావడం గమనార్హం. రిసాల్వ్ టిబెట్ చట్టంపై సంతకం చేయొద్దని జో బైడెన్‌ను చైనా కోరింది. దలైలామా గ్రూపును చైనా వ్యతిరేక వాద శక్తిగా గుర్తించాలని కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

