చైనాలో కరోనా విస్ఫోటనం.. జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఒకే రోజు పదిలక్షల కేసులు..!
Zhejiang | చైనాలో కరోనా మహమ్మారి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. రోజురోజుకు పరిస్థితి చేజారుతున్నాయి. డ్రాగన్ దేశవ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఒకే రోజు పదిలక్షల
China Covd-19 | చైనాలో కరోనా మహమ్మారి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. రోజురోజుకు పరిస్థితి చేజారుతున్నాయి. డ్రాగన్ దేశవ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఒకే రోజు పదిలక్షల కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులు భారీ మొత్తంలో కొవిడ్ కేసులు నమోదవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. జెజియాంగ్ ప్రావిన్స్ చైనా మాన్యుఫ్యాక్చరింగ్ హబ్. ఈ ప్రావిన్స్ షాంఘై నగరానికి సమీపంలో ఉన్నది.
ఇక్కడ జనాభా దాదాపు రూ.6.5కోట్లు ఉంటారని అంచనా. ప్రావిన్స్ ప్రధాన నగరం హాంగ్ జౌ.. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌తో పాటు పలు కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. ఆపిల్‌తో పాటు జపనీస్ వాహన తయారీ సంస్థ నిడెక్ సహా తదితర విదేశీ కంపెనీలకు చెందిన తయారీ యూనిట్లు సైతం ఇక్కడే ఉన్నాయి. కరోనా మహమ్మారి విస్ఫోటనంతో ఆయా యూనిట్లలో ఉత్పత్తి ప్రభావం చూపే అవకాశం ఉందని కంపెనీలు ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నిక్కీ ఆసియా నివేదిక జెజియాంగ్‌లో కరోనా మహమ్మారి పరిస్థితి సమాచారాన్ని తెలిపింది. యూకేకు చెందిన రీసెర్చ్ గ్రూప్ ఎయిర్ఫినిటీ విడుదల నివేదికను ఉటంకిస్తూ చైనాలో రోజువారీ కేసులు ఎక్కువగా ఉన్నాయని నిక్కీ ఆసియా తెలిపింది. చైనా అంతటగా భారీగా కేసులు నమోదవుతున్నాయి.
గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని డాంగ్గువాన్లో శుక్రవారం కొత్త సోకిన వారి సంఖ్య రెండున్నర నుంచి మూడు లక్షల మందికి కొవిడ్ సోకింది. షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని కింగ్డావోలో ఐదు లక్షల మందికి పైగా సోకినట్లు గుర్తించారు. అయితే, చైనా ప్రభుత్వం కొవిడ్ కేసులకు సంబంధించి అధికార సమాచారాన్ని నిలిపివేసింది. ప్రాతీయ అధికారులు గణాంకాలను విడుదల చేస్తుండగా.. డ్రాగన్ దేశంలో కరోనా మహమ్మారితో పరిస్థితిలు దారుణంగా తయారయ్యాయని లెక్కలను చూస్తే అర్థమవుతున్నది. న్యూ ఇయర్‌కు ముందు, తర్వాత కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని, దాదాపు 20లక్షల వరకు నమోదయ్యే అవకాశం ఉంటుందని నిక్కీ ఆసియా అంచనా వేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

