లండన్, నవంబర్ 15: పుట్టగొడుగుల పైచర్మంతో బయోడీగ్రేడబుల్ (సులభంగా భూమిలో కలిసిపోయే) కంప్యూటర్ చిప్‌లు, బ్యాటరీలను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఆస్ట్రియాలోని జోహన్నెస్ కెప్లర్ యూనివర్సిటీ పరిశోధకులు భూమిలో కలిసిపోని ప్లాస్టిక్‌ల స్థానాన్ని భర్తీ చేసే ఉద్దేశంతో వివిధ రకాల పదార్థాలపై పరిశోధనలు చేపట్టారు. అందులోభాగంగా పుట్టగొడుగుల పైచర్మం ఉపయుక్తంగా ఉంటుందని గుర్తించారు. దీనికి సంబంధించిన అధ్యయనం సైన్సెస్ అడ్వాన్సెస్ జర్నల్ లో ప్రచురితమైంది.