Chinese Chess: హోటల్ బాత్‌టబ్‌లో మలవిసర్జన.. చెస్ విన్నర్ టైటిల్‌ను వెనక్కి తీసుకున్న చైనా
Chinese Chess Champion: ప్రఖ్యాత చైనీస్ చెస్ టైటిల్‌ను గెలిచాడతను. ఆ ఆనందంలో హోటల్ గదిలో ఉన్న బాత్టబ్లోనే మలవిసర్జన చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్వాహకులు ఆ చాంపియన్ టైటిల్‌ను వెనక్కి తీసుకున్నారు.
షాంఘై: చైనాలో జాతీయ చెస్(Chinese chess) చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన విన్నర్ యెన్ టైటిల్‌ను ఆ టోర్నీ నిర్వాహకులు వెనక్కి తీసుకున్నారు. అతని ప్రవర్తన సరిగా లేని కారణంగా ఆ టైటిల్‌ను తిరిగి లాగేసుకున్నారు. గెలిచిన ఆనందంలో ఆ విన్నర్ తన హోటల్ రూమ్ బాత్‌టబ్‌లో మల విసర్జన చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చైనాలో దాదాపు వందల ఏండ్ల నుంచి జియాంగ్కి అనే చెస్ టోర్నీ చాలా ఫేమస్. ఈ ఏడాది 48 ఏళ్ల యెన్ చెంగ్లాంగ్ అనే వ్యక్తి ఆ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. చైనీస్ గ్జాంగ్కీ అసోసియేషన్ ఆ టోర్నీ నిర్వహిస్తున్నది. విన్నర్ యెన్ చెంగ్లాంగ్ ప్రవర్తన చాలా బ్యాడ్‌గా ఉన్నందున అతని టైటిల్‌ను వెనక్కి తీసుకున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
అతనికి ఇచ్చిన ప్రైజ్‌మనీ కూడా స్వాధీనం చేసుకున్నారు. యెన్‌పై చీటింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. వైర్లెస్ ట్రాన్స్మీటర్లతో సిగ్నల్స్ అందుకున్నట్లూ ఆరోపణలు ఉన్నాయి. టైటిల్ గెలిచిన రోజున మద్యం సేవించి.. హోటల్ గదిలో ఉన్న బాత్‌టబ్‌లో మలవిసర్జన చేసినట్లు యెన్‌పై కేసు బుక్కైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

