ఎవరెస్ట్‌పై కరోనా.. తమవైపు రాకుండా చైనా కఠిన చర్యలు

బీజింగ్: కరోనా మహమ్మారి ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వతాన్నీ వదల్లేదు. మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడానికి వచ్చిన పర్వతారోహకులకూ ఇది సోకింది. ఇప్పటి వరకు ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌లో ఉన్న 30 మంది దీని బారిన పడ్డారు. దీంతో తాము సృష్టించిన ఈ విపత్తు మళ్లీ తమ వైపు రాకుండా ఉండేందుకు పక్కనే ఉన్న చైనా అప్రమత్తమైంది. ఎవరెస్ట్ నేపాల్‌లో ఉన్నా.. దాని ఉత్తర భాగం మాత్రం చైనా ఆధీనంలో ఉంది. ఆ వైపు నుంచి పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారు. దీంతో తమ వైపు వారికి వైరస్ సోకకుండా కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది.
ఎవరెస్ట్‌పై ప్రత్యేకంగా ఓ లైన్ ఏర్పాటు చేస్తోంది. తమ వైపు నుంచి ఈ శిఖరాన్ని ఎక్కిన వాళ్లు ఆ లైన్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తర, దక్షిణ వైపు నుంచి ఎక్కేవ క్లైంబర్స్ మధ్య కాంటాక్ట్ ఉండకుండా తాము అత్యంత కఠినమైన వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు టిబెట్ అధికారులు వెల్లడించారు. చైనా వైపు నుంచి వచ్చే వాళ్లు శిఖరంపైకి ఎక్కే ముందే దానిపై గైడ్లు ఓ ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇది ఎలా చేస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు.
ఈ ఏడాది ఎవరెస్ట్ ఎక్కడానికి 21 మందికి చైనా అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ నుంచే వీళ్లంతా టిబెట్‌లో క్వారంటైన్లో ఉన్నారు. తమ వైపు ఉన్న ఎవరెస్ట్ సమీపంలో వైరస్ లేకుండా చూడటానికి సాధారణ టూరిస్టులను చైనా ఇప్పటికే నిషేధించింది. గతేడాది నుంచి కరోనా కారణంగా విదేశీ క్లైంబర్స్‌ను కూడా అనుమతించడం లేదు. కేవలం తమ దేశ పర్వతారోహకులకే అనుమతి ఇచ్చింది.
నేపాల్ కూడా గతేడాది ఇలాగే చేసినా.. టూరిజాన్ని మళ్లీ గాడిలో పడేసేందుకు ఈసారి విదేశీ టూరిస్టులను కూడా అనుమతించింది. ఎవరెస్ట్ ఎక్కడానికి అనుమతి కోసమే నేపాల్ ప్రభుత్వానికి 11 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత తమ సాహసయాత్ర పూర్తి చేయడానికి మరో 40 వేల డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ నేపాల్‌నూ అతలాకుతలం చేస్తోంది. అది కాస్తా ఎవరెస్ట్ బేస్ క్యాంప్నూ తాకింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

